'బాహుబలి' రికార్డులు బద్దలు.. తొలి రోజే నైజాంలో 'పుష్ప' వసూళ్ల సునామీ
- నిన్న పుష్ప విడుదల
- నైజాంలో ఎన్నడూ లేని విధంగా షేర్
- రూ.11.44 కోట్ల షేర్, రూ.16.5 కోట్ల గ్రాస్
- గతంలో ప్రభాస్ సాహో సినిమాకు రూ.9.41 కోట్లు, బాహుబలికి 8.9 కోట్లు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో సుకుమార్ రూపొందించిన ఈ సినిమా తొలి రోజు బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను తొలి రోజే చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. దీంతో తొలి రోజు నైజాంలో ఎన్నడూ లేని విధంగా రూ.11.44 కోట్ల షేర్, రూ.16.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గతంలో ప్రభాస్ 'సాహో' సినిమాకు నైజాంలో 9.41కోట్ల రూపాయలు, 'బాహుబలి-2'కు 8.9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాకు తొలిరోజు రూ.8.75 కోట్లు, మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు రూ.8.67 కోట్లు, చిరంజీవి 'సైరా' సినిమాకు రూ. 8.10 కోట్లు, 'మహర్షి' సినిమాకు రూ.6.38 కోట్లు, 'బాహుబలి-1' సినిమాకు రూ.6.32 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ 'పుష్ప' బద్దలు కొట్టింది.
కరోనా వేళ 'పుష్ప' ఈ రికార్డులు బద్దలు కొట్టడం గమనార్హం. టాలీవుడ్ లో ఇప్పటికే బాలకృష్ణ 'అఖండ' సినిమా కూడా దూసుకుపోతోంది. ఆ సినిమా ఇప్పటికే మొత్తం కలిపి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ తరలివస్తున్నారు. 'పుష్ప' సినిమాకు ముందు 'అఖండ' సినిమా వసూళ్లు భారీగా రావడంతోనే టాలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
ఇక మరికొన్ని రోజుల్లో సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు మరిన్ని విడుదల కానున్న నేపథ్యంలో రికార్డుల పరంపర కొనసాగుతుందని అంచనా. అల్లు అర్జున్ గత సినిమా 'అల వైకుంఠపురములో' కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని తర్వాత అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకోవడం, నేడు, రేపు సెలవు దినాలు కావడంతో 'పుష్ప' వసూళ్లు భారీగా కొనసాగే అవకాశం ఉంది.