ద్రావిడ్, లక్ష్మణ్ లను తీసుకొచ్చా.. సచిన్ ను కూడా తీసుకురావాలి: గంగూలీ
- సచిన్ ఒక విభిన్నమైన వ్యక్తి
- భారత క్రికెట్లో సచిన్ భాగస్వామ్యం ఉండేలా చూస్తాం
- సచిన్ ను ఏ రూపంలో తీసుకురావాలనే విషయం గురించి ఆలోచించాలి
క్రికెట్ దిగ్గజాలు గంగూలీ, సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ లు ఒకే జట్టులో ఆడి దేశానికి ఎన్నో విజయాలను అందించారు. ఇప్పుడు కూడా సచిన్ మినహా మిగిలిన ముగ్గురూ భారత్ క్రికెట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా, ద్రావిడ్ హెడ్ కోచ్ గా, లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయిన తర్వాత ద్రావిడ్, లక్ష్మణ్ లకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు సచిన్ ను కూడా ఏదో ఒక రకంగా క్రికెట్లోకి తీసుకొచ్చేందుకు గంగూలీ యత్నిస్తున్నారు.
ద్రావిడ్, లక్ష్మణ్ లను తీసుకొచ్చానని.. సచిన్ ను కూడా తీసుకురావాలని గంగూలీ అన్నారు. సచిన్ ఒక విభిన్నమైన వ్యక్తి అని గంగూలీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాలు సచిన్ కు నచ్చకపోయినా... ఏదో ఒక రూపంలో భారత క్రికెట్లో సచిన్ భాగస్వామ్యం ఉండేలా చూస్తామని చెప్పారు. అయితే ఏ రూపంలో సచిన్ ను తీసుకురావాలనే విషయం గురించి ఆలోచించాలని అన్నారు. సచిన్ కూడా ఏదో ఒక రోజు భారత క్రికెట్లోకి వచ్చేందుకు ఓ మార్గాన్ని కనుక్కుంటాడని చెప్పారు.