వణుకుతున్న తెలంగాణ.. హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు!

  • గత మూడు రోజులుగా భారీగా పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  • హైదరాబాదులో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • మరో నాలుగైదు రోజులు కూడా ఇలాగే తక్కువ ఉష్ణోగ్రతలు 
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ సైతం చలితో గజగజా వణుకుతోంది. హైదరాబాద్ శేరలింగంపల్లిలోని హెచ్సీయూ వద్ద 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 7.1 డిగ్రీలు, జహీరాబాద్ లో 7.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్టు అధికారులు తెలిపారు.

 చలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో చలి పెరుగుతోంది. మరో నాలుగైదు రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


More Telugu News