పంతం నెగ్గించుకున్న సిద్ధూ.. పంజాబ్ డీజీపీ తొలగింపు
- డీజీపీ ఇక్బాల్ ప్రీత్‌ను తొలగిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు
- ఆయన స్థానంలో సిద్ధూ కోరుకున్న సిద్ధార్థ్ చటోపాధ్యాయకు బాధ్యతలు
- గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసిన కేసులో ఇక్బాల్ సరిగా వ్యవహరించలేదని సిద్ధూ ఆరోపణ
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. డీజీపీని తొలగించాల్సిందేనంటూ ఆయన చేసిన డిమాండ్‌కు సొంత ప్రభుత్వం తలొగ్గింది. డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సహోతాను తొలగించిన ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఆయన స్థానంలో సిద్ధూ చెప్పిన సిద్ధార్థ్ చటోపాధ్యాయను నియమించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి శిరోమణి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వ హయాంలో గురుగ్రంథ్ సాహిబ్‌ను కొందరు అపవిత్రం చేసిన కేసు దర్యాప్తులో ఇక్బాల్ సరిగా వ్యవహరించలేదన్నది సిద్ధూ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో సిద్ధూకు, కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత చన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ సిద్ధూ మాత్రం తన డిమాండ్ నుంచి పక్కకు తప్పుకోలేదు. డీజీపీని తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.