చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్
- బంగ్లాదేశ్ లో టోర్నీ
- లీగ్ మ్యాచ్ లో 3-1తో పాక్ ను ఓడించిన భారత్
- చిరకాల ప్రత్యర్థిపై పైచేయి
- రెండు గోల్స్ సాధించిన హర్మన్ ప్రీత్ సింగ్
భారత్, పాకిస్థాన్ దేశాల వైరం ప్రభుత్వాల పరంగానే కాదు, క్రీడల్లోనూ కొనసాగుతోంది. దాయాదులు ఏ వేదికపై క్రీడల్లో తలపడినా అది అభిమానులకు రోమాంఛకంగానే ఉంటుంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోగానే, స్వదేశంలో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే భారత హాకీ జట్టు తాజాగా నమోదు చేసిన విజయం అభిమానులను సంతోషానికి గురిచేసింది.
బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో నేడు భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తుచేసింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు. పాకిస్థాన్ తరఫున జునైద్ మంజూర్ ఒకే ఒక గోల్ నమోదు చేశాడు. గత మ్యాచ్ లో భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్ ను 9-0తో మట్టికరిపించింది.