మూడేళ్లవుతున్నా కేసీఆర్ ఆ ఊసు ఎత్తడం లేదు: బండి సంజయ్
- ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి
- లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. నెలరోజుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. మూడేళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేశారని... గడువు ముగిసే సమయం వచ్చినా సీఎం ఆ ఊసు ఎత్తడం లేదని మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కానీ, న్యాయ నిపుణులతో కానీ చర్చించలేదని విమర్శించారు.