అధికారంలో ఉన్నప్పుడు చేయలేక.. ఇప్పుడు మా మీద విమర్శలు గుప్పిస్తున్నారు: పేర్నినాని

  • విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు 8 వేల ఎకరాలు అవసరం
  • చంద్రబాబు అప్పట్లో కేంద్ర సాయాన్ని కోరారు
  • 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేదు
విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు అవసరమని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ మేరకు 2016-17లోనే నివేదిక ఇచ్చారని... దీంతో అప్పట్లో కేంద్ర సాయాన్ని చంద్రబాబు  కోరారని తెలిపారు. భూసేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని... అయినా 2018 వరకు టీడీపీ ప్రభుత్వం కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేదని చెప్పారు.

అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన టీడీపీ నేతలు... ఇప్పుడు మేము చేయలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలని అన్నారు. దుర్గ గుడి ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లను చంద్రబాబు ఐదేళ్లలో కట్టించలేకపోయారని చెప్పారు. జగన్ మాత్రం రెండున్నరేళ్లలో బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ కు అనుమతి సంపాదించి నిర్మాణం కూడా పూర్తి చేశారని అన్నారు.


More Telugu News