పెగాసస్ స్నూపింగ్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ షాక్
- జస్టిస్ లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసిన బెంగాల్ ప్రభుత్వం
- అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీ వేసింది
- మరో కమిటీ ఎందుకంటూ అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పెగాసస్ స్నూపింగ్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్టే విధించారు. ఇవాళ కమిషన్ పై గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. మమత సర్కార్ పై అసహనం వ్యక్తం చేసింది.
ఓపక్క స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జస్టిస్ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా జస్టిస్ లోకూర్ కమిషన్ ను ఆయన ఆదేశించారు.
పెగాసస్ స్నూపింగ్ కేసు దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు దానిపై ఆందోళనలు చేశాయి. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి పేపర్లు చించేసి చైర్మన్ మీదకు విసిరేశారు. దీనిమీద అప్పటకే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. ఇష్టారీతిన ప్రజల మీద నిఘా పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదని తేల్చి చెప్పింది.