సంతోష్, ఆయ‌న భార్య‌కి ఏమి జ‌రిగినా పూర్తిగా సీఐడీదే బాధ్య‌త‌: నారా లోకేశ్

  • టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్ అరెస్ట్
  • ఆయ‌న భార్య‌ నిండుగ‌ర్భిణి
  • ఉగ్ర‌వాదుల్లా సీఐడీ పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేశారు
  •  క‌నీసం నోటీసు ఇవ్వ‌కుండా చ‌ర్య‌లు
టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్ ను రాజమండ్రిలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశార‌ని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆ స‌మ‌యంలో సంతోష్‌ను టీడీపీ నేత బుచ్చయ్య చౌద‌రి క‌లిసిన ఫొటోను లోకేశ్ పోస్ట్ చేశారు.

'సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ య‌ల్ల‌పు సంతోష్.. నిండుగ‌ర్భిణి అయిన భార్య‌ని ఆసుప‌త్రిలో డెలివ‌రీ కోసం చేర్చ‌గా, ఉగ్ర‌వాదుల్లా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.

'క‌నీసం నోటీసు ఇవ్వ‌కుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వ‌కుండా వైసీపీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు సీఐడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చాలా దారుణం. సంతోష్, ఆయ‌న భార్య‌కి ఏమి జ‌రిగినా పూర్తిగా సీఐడీదే బాధ్య‌త‌. క‌డుపుమండి సోష‌ల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టులా? పోస్టులు పెట్టే యాక్టివిస్టుల‌ను టెర్ర‌రిస్టుల్లా అరెస్టు చేయిస్తారా?' అని నారా లోకేశ్ మండిప‌డ్డారు.


More Telugu News