2 బ‌స్సుల్లో వెళ్లిన ఐపీఎస్ అధికారుల‌ను జ‌గ‌న్ క‌లవ‌లేదు: నాదెండ్ల మ‌నోహ‌ర్

  • పోలీసు ఉన్నతాధికారులందరూ వెళ్లారు
  • సీఎం గారు బాగా బిజీ అని వెనక్కి పంపేస్తారా?
  • ఆఫీసర్లనే కలవని సీఎం సామాన్యులనేం కలుస్తారు?
  • విజయవాడలో అరగంటపాటు ట్రాఫిక్ ఆపేశారు  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు శాఖ‌లో ప‌నిచేస్తోన్న ఐపీఎస్ అధికారులంతా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో నిన్న రిట్రీట్‌ స‌మావేశంలో పాల్గొన్నార‌ని, అనంత‌రం రెండు బ‌స్సుల్లో తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ కార్యాల‌యానికి వెళ్లారని 'ఈనాడు' దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ వార్త‌ను జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు. అయితే, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో జ‌గ‌న్ బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఐపీఎస్‌ల‌తో ఆయ‌న భేటీ నేటికి వాయిదా ప‌డింద‌ని ఆ వార్త‌ల్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌పై నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'శాంతి భద్రతల విధుల్లో కీలకంగా ఉండే పోలీసు ఉన్నతాధికారులందరూ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇంటికి వెళ్తే సీఎం గారు బాగా బిజీ అని వెనక్కి పంపేస్తారా? రెండు బస్సులు వేసుకుని విజయవాడలో అరగంటపాటు ట్రాఫిక్ ఆపేసి జనాన్ని రోడ్డు మీదే నిలిపేసి మరీ వెళ్తే ఐపీఎస్‌ ఆఫీసర్లనే కలవని సీఎం సామాన్యులనేం కలుస్తారు?' అని నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌శ్నించారు.


More Telugu News