తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసుల వెల్లడి
- తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం
- ఇటీవల ముగ్గురికి పాజిటివ్
- కొత్త కేసులతో కలిపి ఏడుకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- దేశంలో 87కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
తెలంగాణలో తాజాగా నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి పెరిగింది. అటు కర్ణాటకలోనూ మరో 5 కేసులు వెలుగుచూశాయి. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1, చత్తీస్ గఢ్ లో 1, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ క్రమంలో, దేశంలో కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసుల సంఖ్య 87కి చేరింది.