సప్తగిరి కూడా తగ్గడం లేదే!
- సప్తగిరి హీరోగా 'గూడుపుఠాణి'
- కథానాయికగా నేహా సోలంకి
- తాజాగా ఖరారు చేసిన రిలీజ్ డేట్
- ఈ నెల 25వ తేదీన విడుదల
కమెడియన్ గా సప్తగిరికి మంచి క్రేజ్ ఉంది. నెల్లూరు యాసతో ఆకట్టుకున్న ఆయన, కథానాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'గూడుపుఠాణి'. శ్రీనివాస రెడ్డి - రమేశ్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఈ సినిమా నడుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సప్తగిరి మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఆయన జోడీగా నేహా సోలంకి అలరించనుంది.
ఈ నెల 24వ తేదీన నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదలవుతోంది. ఫ్యామిలీ హీరోగా నానికి మంచి క్రేజ్ ఉంది. ఇక కథానాయికలుగా సాయిపల్లవి - కృతి శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాంటి సినిమా బరిలో ఉండగా, ఆ మరుసటి రోజు రంగంలోకి దిగుతుండటమనేది సప్తగిరి చేసే సాహసంగానే చెప్పాలి .
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఈ సినిమా నడుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సప్తగిరి మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఆయన జోడీగా నేహా సోలంకి అలరించనుంది.
ఈ నెల 24వ తేదీన నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదలవుతోంది. ఫ్యామిలీ హీరోగా నానికి మంచి క్రేజ్ ఉంది. ఇక కథానాయికలుగా సాయిపల్లవి - కృతి శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాంటి సినిమా బరిలో ఉండగా, ఆ మరుసటి రోజు రంగంలోకి దిగుతుండటమనేది సప్తగిరి చేసే సాహసంగానే చెప్పాలి