'అఖండ' సినిమా చూసిన చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు.. ఏమన్నారంటే..?
- 'అఖండ' సినిమా చాలా బాగుందన్న అర్చకులు రంగరాజన్
- ధర్మానికి ఎంత అన్యాయం జరుగుతోందో ఈ సినిమాలో చూపించారని వ్యాఖ్య
- సినిమాలో నటించిన అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్న రంగరాజన్
బాలకృష్ణ తాజా చిత్రం 'అఖండ' ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను అఘోరాలు సైతం చూడటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ తన బృందంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ... 'అఖండ' సినిమా చూశామని, చాలా బాగుందని చెప్పారు. ధర్మానికి ఎంత అన్యాయం జరుగుతోందో ఈ చిత్రంలో చూపించారని అన్నారు. 'అహింసా పరమో ధర్మః' అనే వ్యాక్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని అంతం చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించవచ్చని ఈ సినిమాలో చూపించారని చెప్పారు.
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ధర్మాన్ని రక్షించాల్సిన మనం ఆ పని చేయలేనప్పుడు, ఎవరైనా ఆ పని చేస్తే ఆనందంగా చూస్తామని... ఈ సినిమా విజయవంతం కావడానికి అదే కారణమని చెప్పారు.