తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల విడుదల

  • 2020-21 ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వెల్లడి
  • బాలికల్లో అత్యధిక ఉత్తీర్ణతా శాతం
  • రీకౌంటింగ్, వెరిఫికేషన్ కు ఈ నెల 22 తుది గడువు
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడయ్యాయి. 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రంలో 4,59,242 మంది విద్యార్థులు హాజరు కాగా... 2,24,012 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలే అత్యధికంగా 56 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 42 శాతం సాధించారు.

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ ను tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఇక, రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోరుకునేవారు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని, స్కాన్ కాపీతో పాటు రీవెరిఫికేషన్ కోరుకునేవారు ఒక్కో పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని బోర్డు వివరించింది.


More Telugu News