శేఖర్ మాస్టర్ నిర్మాతగా 'టెర్రేస్ లవ్ స్టోరీ'.. నేటి నుంచి తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్!

  • 'టెర్రేస్ లవ్ స్టోరీ' పేరుతో తొలి వెబ్ సిరీస్ నిర్మించిన శేఖర్ స్టూడియోస్
  • ప్రధాన పాత్రల్లో అనుపమ్ చెర్రీ, సంయూరెడ్డి
  • సత్య కృష్ణ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వరుస సినిమాలతో పాటు టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా చాలా బిజీగా ఉంటున్నారు. శేఖర్ స్టూడియోస్ పేరిట ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా ఆయన 'టెర్రేస్ లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఈరోజు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తమ శేఖర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో తొలిసారి 'టెర్రేస్ లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ చేశామని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ను అందరూ చూసి తమను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో అనుపమ్ చెర్రీ, సంయూరెడ్డి ప్రధాన పాత్రలను పోషించారు. సత్య కృష్ణ దర్శకత్వంలో వెబ్ సిరీస్ రూపొందింది. శేఖర్ మాస్టర్ సతీమణి శిరీష ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు.



More Telugu News