దక్షిణాఫ్రికాకు టీమిండియా ఆటగాళ్ల పయనం.. బీసీసీఐ షేర్ చేసిన ఫొటోల్లో కనిపించని కోహ్లీ!

  • ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా జట్టు
  • కోహ్లీ లేని ఫొటోలను షేర్ చేసిన బీసీసీఐ
  • బీసీసీఐపై మండిపడుతున్న కోహ్లీ అభిమానులు
ఊహించని, ఇబ్బందికర పరిణామాల మధ్య టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు బయల్దేరింది. ఈ సిరిస్ లో తొలుత ఇండియా మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టెస్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు.

మరోవైపు వన్డే కెప్టెన్ గా కోహ్లీని తొలగించడంపై వివాదం కొనసాగుతోంది. కెప్టెన్ బాధ్యతల నుంచి నుంచి తనను తొలిగిస్తున్న విషయాన్ని బీసీసీఐ తనకు చెప్పలేదంటూ ఏకంగా బోర్డునే ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని కోహ్లీ చేశాడు. అయితే, కోహ్లీతో ఈ విషయం గురించి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడారని బీసీసీఐ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత వివాదాస్పదమయింది.

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరింది. కరోనా నేపథ్యంలో వీరంతా ప్రత్యేక విమానంలో బయల్దేరారు. విమానంలో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో కోహ్లీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో బీసీసీఐపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. విమానంలో కోహ్లీ ఎక్కడున్నాడో మీకు కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News