అంతరించిపోతోన్న కళను కాపాడుకోవడానికి మంత్రి గంగులను కలిసిన కిన్నెర మొగులయ్య
- గంగుల ముందే కేసీఆర్ పథకాలపై పాట
- తమకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని విజ్ఞప్తి
- కొత్త కళాకారులను తయారు చేస్తానని వ్యాఖ్య
కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు భీమ్లా నాయక్ సినిమాలోని టైటిట్ సాంగ్తో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన ఆయన అంతరించిపోతోన్న తమ కళను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ను కలిశారు.
ఈ సందర్భంగా గంగుల ముందే కేసీఆర్ పథకాలపై పాట పాడి వినిపించారు. తమకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కోరారు. అలాగే, కిన్నెర వాయిద్య అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త కళాకారులను తయారు చేస్తానని చెప్పారు. ఆయన వినతి పట్ల గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారు.