కోహ్లీ వ్యాఖ్యలతో ముదిరిన వివాదం.. కపిల్‌దేవ్‌ సంచలన వాఖ్యలు

  • వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు తనకు ఎవరూ చెప్పలేదన్న కోహ్లీ
  • కోహ్లీతో చేతన్ శర్మ మాట్లాడారన్న బీసీసీఐ
  • కెప్టెన్సీని నిర్ణయించే పూర్తి అధికారం సెలెక్టర్లదేనన్న కపిల్
బీసీసీఐని ఉద్దేశించి టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందిస్తూ... కోహ్లీ అలా మాడ్లాడి ఉండకూడదని వ్యాఖ్యానించింది. కోహ్లీతో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడారని తెలిపింది. బీసీసీఐ వివరణతో విషయం మరింత గందరగోళంగా మారింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.

కోహ్లీ ఆడినంతగా క్రికెట్ సెలెక్టర్లు ఆడి ఉండకపోవచ్చని... కానీ కెప్టెన్సీని నిర్ణయించే సంపూర్ణ అధికారం సెలెక్టర్లకు ఉంటుందని కపిల్ అన్నారు. కెప్టెన్సీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలను సెలెక్టర్లు కోహ్లీకే కాదు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయం కోహ్లీకే కాకుండా అందరు ఆటగాళ్లకు వర్తిస్తుందని చెప్పారు. కెప్టెన్సీ వివాదానికి కోహ్లీ ముగింపు పలకాలని... దక్షిణాఫ్రికా టూర్ పై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈనెల భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.


More Telugu News