'శ్యామ్ సింగ రాయ్'లో అదే కీలకమట!
- రాహుల్ దర్శకుడిగా 'శ్యామ్ సింగ రాయ్'
- 70వ దశకంలో సాగే కథ
- బెంగాలీ యువతిగా సాయిపల్లవి
- ఈ నెల 24వ తేదీన విడుదల
నాని తన కెరియర్లోనే డిఫరెంట్ లుక్ ను ట్రై చేసిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. 70వ దశకంలో కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బెంగాలి చీరకట్టులో సాయిపల్లవి కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది.
ఈ కథ రెండు కాలాల మధ్య కొనసాగుతుంది. వాసు - శ్యామ్ సింగ రాయ్ అనే రెండు పాత్రలను నాని పోషించాడు. ఈ రెండు కాలాలకు సంబంధించిన కథకు స్క్రీన్ ప్లే ప్రాణంగా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలకి సంబంధించిన లింక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని అంటున్నారు. అది గనుక సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమైతే సినిమా హిట్టేనని చెబుతున్నారు.
ఈ సినిమాలో వాసు పాత్రకి కథానాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఇక మడోన్నా పాత్ర ఏమిటనేది సస్పెన్స్ గా ఉంచుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సిరివెన్నెల రెండు పాటలు అందించారు. ఆ పాటలు ఇప్పుడు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.