అమరావతి రైతుల తిరుపతి సభకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
- మొన్న ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
- రేపు మధ్యాహ్నం నుంచి రేణిగుంట సమీపంలో బహిరంగసభ
- అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలను పంపిన అమరావతి జేఏసీ
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర మొన్న తిరుపతిలోని అలిపిరి వద్ద ముగిసింది. పాదయాత్ర చేసిన రైతులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుపతి రేణిగుంట సమీపంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు అమరావతి జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభను నిర్వహించుకోవడానికి ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిపిందే. దీంతో సభకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. అమరావతి మహోద్యమం పేరుతో సభను నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలను పంపామని చెప్పారు. అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేలా సభను నిర్వహిస్తామని తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరగనుంది.