తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో ఇద్దరిపై దాడిచేసిన చిరుత.. స్వల్ప గాయాలు

  • తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఘటన
  •  వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత దాడి 
  • అశ్విని ఆసుపత్రికి తరలింపు
  • భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
తిరుమల ఘాట్ రోడ్డులో గత కొంతకాలంగా సంచరిస్తూ భక్తులను భయపెడుతున్న చిరుత ఈసారి దాడికి దిగడం కలకలం రేపింది. ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణ బైక్‌పై రెండో ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుండగా వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత వారిపై దాడిచేసింది. ఈ దాడిలో వారిద్దరూ స్పల్పంగా గాయపడ్డారు. చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వీరు కనిపించడంతో దాడి చేసి ఉండొచ్చని వీజీవో బలారెడ్డి తెలిపారు.

శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం ఎక్కువైందని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడిలో స్వల్ప గాయాలతో బయటపడిన ఆనంద్, రామకృష్ణలను విజిలెన్స్ సిబ్బంది అంబులెన్స్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.


More Telugu News