ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరిపించాలి: పవన్ కల్యాణ్
- జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
- ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం
- మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని పవన్ డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో డ్రైవర్ తో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.