ఏపీ కోస్తా తీర ప్రాంతం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు

  • వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై అధికారుల అప్‌డేట్స్‌
  • రాగల 3 రోజుల వరకు వాతావరణ ప‌రిస్థితులపై వివర‌ణ‌
  • నేడు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం
ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతం వెంబడి తక్కువ ఎత్తులో (కింది స్థాయి) ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ ప‌రిస్థితులు ఎలా ఉండ‌నున్నాయ‌నే విష‌యంపై అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ‌ శాఖ అధికారులు ప‌లు వివ‌రాలు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వివ‌రించారు. కాగా, ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు ఏపీలోని ప‌లు జిల్లాల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా పొడి వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది.


More Telugu News