బంగ్లాదేశ్‌లో భారత రాష్ట్రపతికి సైన్యం ఘన స్వాగతం.. వీడియో ఇదిగో
- బంగ్లాదేశ్‌లో కోవింద్ 3 రోజుల పర్యటన
- సైనికుల గౌరవ వందనం
- ఢాకాలో బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకలు
- 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ విజయం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్న కోవింద్‌కు అక్కడి సైన్యం ఘన స్వాగతం పలికింది. రాష్ట్రపతి సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఢాకాలో నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటోన్న నేపథ్యంలో కోవింద్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
కాగా, భారత్, బంగ్లాదేశ్ ల మధ్య 50 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ బలగాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలైన అనంతరం భారత రాష్ట్రపతి చేపడుతోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో కోవింద్ పాల్గొంటారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ తోనూ ఆయన భేటీ అవుతారు.