ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళుతూ... హుషారుగా డ్యాన్సులు చేసిన రైతులు.. వీడియో ఇదిగో
- సాగుచట్టాల రద్దు కోరుతూ 15 నెలలుగా ఆందోళన
- నిరసన వీడుతూ కదులుతున్న రైతులు
- బోర్డర్ వద్ద సంబరాలు జరుపుకుంటున్న వైనం
కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగించిన పోరాటం ఫలించిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు ఆందోళనలను విరమిస్తున్నారు. 15 నెలలుగా చేస్తోన్న ఆందోళనలను విరమిస్తోన్న నేపథ్యంలో రైతులు డ్యాన్సులు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్ కౌశాంబిని విడిచి రైతులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. బోర్డర్ వద్ద వేసిన టెంట్లను రైతులు తొలగించారు. ఈ నేపథ్యంలో బోర్డర్ వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు. పాటలు పెట్టుకుని హుషారుగా డ్యాన్సులు చేసిన వీడియో వైరల్ అవుతోంది.