నేను మారాను.. తప్పు చేసి ఉంటే క్షమించండంటూ శిరస్సు వంచిన టీడీపీ నేత యరపతినేని
- దాచేపల్లిలో టీడీపీ గౌరవ సభ
- ఎడ్లబండ్లతో రైతుల భారీ ర్యాలీ
- తప్పు చేసి ఉంటే క్షమించాలని పదేపదే కోరిన యరపతినేని
- అందరం కలిసి పార్టీని గెలిపించుకుందామని పిలుపు
తాను తప్పుచేసి ఉంటే క్షమించాలంటూ టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శిరస్సు వంచి పార్టీ కార్యకర్తలను కోరారు. టీడీపీ ఆధ్వర్యంలో నిన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో గౌరవసభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చా వేదిక నిర్వహించగా, రైతులు ఎండ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సభలో యరపతినేని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
విభేదాలను పక్కనపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు పాటుపడదామని పిలుపునిచ్చారు. సమష్టిగా పనిచేసి గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని గెలిపించుకుందామన్నారు. నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. తాను మారానని, మరింతగా మారతానని చెప్పారు. జనవరి నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు. కాగా, దాచేపల్లిలో టీడీపీ కౌన్సిలర్లు ఏడుగురిని ఈ సందర్భంగా సన్మానించారు.