ఒమిక్రాన్ కలవరం.. కాలిఫోర్నియాలో మాస్క్ తప్పనిసరి

  • కాలిఫోర్నియాలో పెరుగుతున్న కేసులు
  • నేటి నుంచి అమల్లోకి
  • ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటేనన్న ప్రభుత్వం
ఒమిక్రాన్ కలవరానికి తోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అమెరికాలోని కాలిఫోర్నియా అప్రమత్తమైంది. రెండు వారాల వ్యవధిలోనే అక్కడ కొవిడ్ కేసుల సంఖ్య 47 శాతం పెరిగింది. దీనికి తోడు ఈ సెలవుల్లో ప్రజలు తమ స్నేహితులు, కుటుంబాలను కలుసుకునే అవకాశం ఉండడంతో అక్కడి ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన నేటి నుంచి వచ్చే నెల 15 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుత సమయంలో కరోనాను అదుపు చేసేందుకు తమ వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాస్కేనని, అదొక్కటే బాగా పనిచేస్తోందని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే అన్నారు. కాబట్టి ప్రజలందరూ మాస్కులు ధరించాలని, ఒమిక్రాన్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News