మహారాష్ట్రలో మరో 8 ఒమిక్రాన్ కేసులు... ఎవరికీ ప్రయాణ చరిత్ర లేదంటున్న అధికారులు!
- ఒక్క ముంబయిలోనే ఏడు కేసులు
- స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఐదుగురు వ్యక్తులు
- మహారాష్ట్రలో 28కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- భారత్ లో ఇప్పటివరకు 57 కొత్త వేరియంట్ కేసులు
మహారాష్ట్రలో తాజాగా మరో 8 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబయి నగరంలో వెలుగు చూశాయి. వీరిలో ఎవరికీ విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల వీరిలో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీ ప్రయాణించినట్టు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, మిగతా ఐదుగురు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని వివరించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరుగురు ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.
తాజా కేసులతో మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. అటు, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి చేరింది. మహారాష్ట్రలో విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండానే ఒమిక్రాన్ కేసులు వెల్లడికావడం కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందుతోందన్న సంకేతాలు ఇస్తోంది.