ఇండిగోపై కోర్టులో కేసు వేస్తా: రోజా
- రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు
- తిరుపతి బదులు బెంగళూరులో ల్యాండ్ అయిన విమానం
- విమానం దిగేందుకు రూ. 5వేలు అడిగారని మండిపడ్డ రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇండిగో విమానం చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు.
అక్కడ గంటపాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత ల్యాండ్ చేసినప్పటికీ ఎవర్నీ విమానం నుంచి కిందకు దింపలేదు. ఈ ఘటనపై రోజా మండిపడ్డారు. తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని అన్నారు. నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని... బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని... తమను ఇంత క్షోభకు గురిచేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.