విశ్వసుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్.. నెట్ లో జనాలు ఆమె గురించి ఏం వెతికారంటే..?
- మిస్ యూనివర్స్ గా ఎంపికైన మూడో భారతీయురాలు హర్నాజ్ కౌర్
- ఆమె ఎత్తు, వయసు గురించి ఎక్కువగా శోధించిన నెటిజెన్లు
- సుస్మిత, లారా దత్తాల గురించి కూడా వెతికిన నెటిజెన్లు
మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత అందాలభామ హర్నాజ్ కౌర్ సంధు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ లో జరిగిన ఈ అందాల పోటీలో పంజాబ్ కు చెందిన హర్నాజ్ విశ్వసుందరిగా అవతరించింది. 21 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటం భారత్ సొంతమైంది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న 3వ భారతీయ మహిళగా హర్నాజ్ నిలిచింది. మరోవైపు మిస్ యూనివర్స్ గా హర్నాజ్ గెలుపొందిందనే వార్తలు రాగానే ఇంటర్నెట్ హీటెక్కింది. హర్నాజ్ గురించి నెటిజెన్లు విపరీతంగా సర్చ్ చేశారు. ఆమె గురించి వివరాలు తెలుసుకునేందుకు భారతీయులు ఉత్సాహం చూపారు.
హర్నాజ్ కౌర్ సంధూ మిస్ యూనివర్స్, మిస్ యూనివర్స్ 2021, మిస్ యూనివర్స్ వంటి పదాలు గూగుల్ సర్చ్ లో టాప్ లో నిలిచాయి. దీంతో పాటు హర్నాజ్ వయసు, ఎత్తు గురించి కూడా ఎక్కువగా సర్చింగ్ జరిగింది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుస్మితా సేన్, లారా దత్తాల గురించి కూడా నెటిజెన్లు శోధించారు.