ఎమ్మెల్సీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్
- మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్
- ఏకగ్రీవమైన ఆరు స్థానాలు
- పోలింగ్ జరిగిన ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే
టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఈ స్థానాలకు సంబంధించి ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్. రమణ, భానుప్రసాద్ గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, ఖమ్మం జిల్లాలో తాతా మధు, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గెలిచారు. దీంతో మొత్తం 12 స్థానాలను టీఆర్ఎస్ స్వీప్ చేసినట్టయింది. ఈ నెల 10న పోలింగ్ జరిగింది.