నేడు వరంగల్ లో 'శ్యామ్ సింగ రాయ్' రాయల్ ఈవెంట్!
- విభిన్న కథా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
- 70వ దశకంలో కలకత్తాలో నడిచే కథ
- ఈ రోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్
- ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
నాని ఇంతవరకూ ఎప్పుడూ కూడా తన సినిమాల మధ్య గ్యాప్ రాకుండా చూసుకున్నాడు. ఆయనకి ఉన్న క్రేజ్ కారణంగా .. ఆయన ఎంచుకునే కథల కారణంగా లుక్ మార్చుకోవలసిన అవసరం పెద్దగా రాలేదు. కానీ తన కెరియర్లో మొదటిసారిగా ఆయన పూర్తి డిఫరెంట్ లుక్ తో చేస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'.
వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. 70వ దశకంలో కలకత్తా నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన కథ ఇది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తున్నారు.
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ .. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. ఇక కృతి శెట్టి .. మడోన్నా కూడా కథానాయికలుగా ఈ సినిమాలో సందడి చేయనున్నారు .
వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. 70వ దశకంలో కలకత్తా నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన కథ ఇది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తున్నారు.
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ .. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. ఇక కృతి శెట్టి .. మడోన్నా కూడా కథానాయికలుగా ఈ సినిమాలో సందడి చేయనున్నారు