సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందరికీ సమానంగా అందించడం దాని వల్లే సాధ్యమైంది: మంత్రి మేకతోటి సుచరిత ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
- ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్‌దే
- ఎవరి ఇష్ట ప్రకారం వారు మతం మారొచ్చు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ఫలాలను అందరికీ సమానంగా అందించడం వెనక క్రైస్తవం ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని చర్చిలో నిన్న నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలను రాష్ట్రంలోని అందరికీ సమానంగా అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆలోచన వెనక క్రైస్తవం ఉందన్నారు. ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరించడం వల్లే అది సాధ్యమైందన్నారు. కుల మతాలు వేర్వేరని పేర్కొన్న మంత్రి.. ఎవరి విశ్వాసాల ప్రకారం వారు మతం మారొచ్చని అన్నారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు.