'శ్యామ్ సింగ రాయ్' ప్రత్యేకత అదే!
- ఈ కథ 70వ దశకంలో నడుస్తుంది
- అప్పటి వాతావరణంలో పాటలు నడవాలి
- ఆ వాద్యాలను ఉపయోగించాను
- మంచిపేరు వస్తుందన్న మిక్కీ జె మేయర్
నాని కథానాయకుడిగా 'శ్యామ్ సింగ రాయ్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మిక్కీ మాట్లాడాడు.
"ఈ కథ 70వ దశకంలో నడుస్తుంది .. దానికి తగినట్టుగానే నేపథ్య సంగీతాన్ని అందించాను. ఆ కాలంలో ఎక్కువగా ఉపయోగించిన తబల .. సితార్ .. సంతూర్ వంటి వాద్యాలను వాడాను. కలకత్తా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది కనుక, బెంగాల్ సంగీతాన్ని కూడా జోడించాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కొత్త ఫ్లేవర్ తో వస్తున్న సినిమా ఇదే.
ఈ సినిమా కోసం సిరివెన్నెల గారు రెండు పాటలను రాశారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.