తిరుపతి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

  • 43వ రోజుకు రైతుల మహా పాదయాత్ర
  • రైతుల శ్రీవారి దర్శనంపై ఉత్కంఠ
  • దర్శనం కల్పించాలని టీటీడీ ఈవోకి జేఏసీ నేతల లేఖ
  • నిబంధనలు పాటిస్తామని హామీ
ఏపీ రాజధాని అమరావతి ఒక్కటేనంటూ రైతులు సాగిస్తున్న మహా పాదయాత్ర తిరుపతి చేరుకుంది. రాజధాని రైతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు రేపు సాయంత్రం అలిపిరి చేరుకోనున్నారు. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం రైతుల తరఫున జేఏసీ నేతలు టీటీడీ ఈవోకు లేఖ సమర్పించారు. టీటీడీ నిబంధనలు పాటిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. స్వామివారి దర్శనానికి సంబంధించి టీటీడీ నుంచి సానుకూల స్పందన వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రైతులు పాదయాత్ర ముగించనున్నారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతులు, మహిళలు సాగిస్తున్న పాదయాత్ర నేటికి 43వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్రలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.


More Telugu News