మాట ఇచ్చుడే కానీ చేసి చూపేది లేదు: షర్మిల విమర్శలు
- కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల
- నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపాటు
- ఉద్యోగాలు ఇవ్వని సీఎం తమకొద్దని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. మాట ఇచ్చుడే కానీ చేసి చూపేదేమీ లేదని ఆమె విమర్శించారు. వాగ్దానాలు చేసుడే కానీ ఒళ్లు వంచి పని చేసేది లేదని దుయ్యబట్టారు. 'చెవులకు ఇంపైన మాటలే కానీ... చస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి మీరు' అన్నారు. మీకు అధికారం, పదవి ఎందుకని ప్రశ్నించారు. మాటిచ్చి ఏడాదైనా అదే మోసమని విమర్శించారు.
'ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతను మోసం చేశావు కదా కేసీఆర్?' అని షర్మిల అన్నారు. రాష్ట్రంలో 39 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసింది లేదని విమర్శించారు. నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే మీలో చలనం లేదని అన్నారు. మిమ్మల్ని కుర్చీ దింపితే కానీ తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు ఎక్కరని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వని ముఖ్యమంత్రి తమకొద్దని అన్నారు.