విద్యాదీవెన పథకంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

  • ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం అమలు
  • ఇప్పటివరకు తల్లుల ఖాతాల్లో నగదు జమ
  • హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు విద్యాసంస్థలు
  • ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన న్యాయస్థానం
  • రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సర్కారు
  • తాజాగా రివ్యూ పిటిషన్ కొట్టివేత
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా నగదును విద్యాసంస్థల ఖాతాల్లో జమచేయాలన్న గత ఆదేశాలను హైకోర్టు మరోసారి సమర్థించుకుంది. గతంలో దీనిపై హైకోర్టు తీర్పు ఇవ్వగా, ఏపీ సర్కారు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం... విద్యాదీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో కాకుండా విద్యాసంస్థల ఖాతాల్లోనే జమ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను కొట్టివేసింది.

సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల తరఫున వెంకటరమణ, విజయ్ వాదనలు వినిపించారు.


More Telugu News