ఏపీలో 2 రోజులపాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.. ఐఎండీ హెచ్చ‌రిక‌

  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం
  • ఐదు రోజులు త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల్లోనూ వ‌ర్షాలు
  • ప‌లు రాష్ట్రాల్లో ఉద‌యం పూట‌ దట్టమైన పొగ మంచు  
రానున్న రెండు రోజులు ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అలాగే, రానున్న ఐదు రోజులు త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేర‌ళ, మ‌హె, ల‌క్ష‌ద్వీప్, అండ‌మాన్ నికోబార్, క‌శ్మీర్‌, లడఖ్‌, గిల్గిత్ బ‌ల్గిస్థాన్‌, ముజాఫ‌రాబాద్‌ ల‌లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. పంజాబ్, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌, ఢిల్లీ, ఉత్త‌ర రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ, తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 6-10 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో 3-4 రోజుల పాటు క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు క‌న‌ప‌డే అవ‌కాశం లేద‌ని చెప్పింది. అసోం, మేఘాల‌యా, నాగాలాండ్, మ‌ణిపూర్‌, మిజోరం, త్రిపుర‌ల్లో రానున్న 48 గంట‌ల పాటు ఉద‌యం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వివ‌రించింది.


More Telugu News