ఈ చిన్న ప‌దం వాడినందుకు నాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు: సంజ‌య్ రౌత్

  • చుటియా అంటే 'తెలివి త‌క్కువ' అని అర్థం
  • ఢిల్లీలో కేసు న‌మోదు
  • నాపై ఒత్తిడి తీసుకురావ‌డానికే కేసులు  
శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ త‌మ‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ ఓ బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌పై ఢిల్లీలోని మండవాలి పోలీస్ స్టేష‌న్‌లో సంజ‌య్ రౌత్‌పై ఐపీసీ సెక్ష‌న్లు 509, 500 కింద కేసు న‌మోదైంది. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వివ‌రించారు.

దీనిపై సంజ‌య్ రౌత్ స్పందించారు. 'చుటియా' అనే ప‌దం వాడినందుకు త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని, హిందీ నిఘంటువుల ప్ర‌కారం ఆ ప‌దానికి అర్థం 'తెలివి తక్కువ' అని సంజ‌య్ రౌత్ చెప్పారు. త‌న‌పై ఒత్తిడి తీసుకురావ‌డానికి త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కొంద‌రు బీజేపీ నేత‌లు మ‌హిళా నేత‌ల‌పై అభ్యంత‌రకర వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ వారిపై మాత్రం ఇటువంటి కేసులు న‌మోదు కాలేద‌ని సంజ‌య్ రౌత్ అన్నారు.


More Telugu News