మరి, సినిమాల్లో వార‌స‌త్వాల‌కు మీరు వ్య‌తిరేకం కాదా?: పవన్ కల్యాణ్ కు అంబ‌టి సూటిప్రశ్న

  • వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు మోదీ వ్య‌తిరేక‌మ‌ని ప‌వ‌న్ అంటున్నారు
  • అందుకే మోదీతో మిత్ర‌త్వాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు
  • మ‌రి సినిమాల్లో వార‌స‌త్వాలు లేవా?
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డి నుంచి సినిమాల్లోకి వ‌చ్చారు?
  • కాల్‌షీట్లు లేవు కాబ‌ట్టే 8 గంట‌ల దీక్ష చేశారు
ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ వార‌స‌త్వాల‌కు తావు లేకుండా ప‌నిచేస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న‌తో క‌లిసి తాను ప‌ని చేస్తున్నానంటూ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నార‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు గుర్తు చేశారు. మ‌రి గ‌తంలో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు ప‌ని చేశార‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చేస్తున్న‌ది వార‌స‌త్వ రాజ‌కీయాలు కాదా? అని ఆయ‌న నిల‌దీశారు.

'రాజ‌కీయాల్లో వార‌స‌త్వాల‌కు మాత్ర‌మే మీరు వ్య‌తిరేక‌మా?  సినిమాల్లో వార‌స‌త్వాల‌కు మీరు వ్య‌తిరేకం కాదా?  మీరు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? మీ క‌థ ఏంటీ?' అని అంబ‌టి ప్ర‌శ్నించారు. త‌న ఆర్థిక మూలాలు దెబ్బ‌తీయ‌డానికే సినిమా టికెట్ల విష‌యంలో ఏపీ స‌ర్కారు కొత్త విధానాలు తీసుకొస్తోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంద‌రి బాగుకోస‌మే ఏపీ స‌ర్కారు కొత్త విధానాన్ని తీసుకొచ్చింద‌ని చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గ‌తంలో మోదీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ఆయ‌న‌ను పొగుడుతున్నార‌ని చెప్పారు. 'బ‌హుశా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇప్పుడు సినిమాల్లో కాల్‌షీట్లు లేవేమో, అందుకే 8 గంట‌ల‌ దీక్ష అంటూ ఇప్పుడు ముందుకు వ‌చ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం మీద పోరాటం చేయ‌లేని మీరు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌డి ఏడుస్తున్నారు' అంటూ అంబ‌టి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పోరాట క్ర‌మంలో అంద‌రూ వ‌చ్చి క‌లుస్తారు. అంతేగానీ, అంద‌రూ వ‌స్తేనే పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ అంటున్నారు. ఇది స‌రైన విధానం కాదు. చంద్రబాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న ఇటువంటి ప‌నులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. బీజేపీతో మిత్ర‌త్వం కొన‌సాగించాలంటే విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటుప‌రం చేయ‌బోమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి చెప్పాలి' అని అంబ‌టి రాంబాబు డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తిపై ఒక‌లా మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు మ‌రోలా మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడే విష‌యాల‌కు, చేసే ప‌నుల‌కు పొంతన లేద‌ని చెప్పారు. 'త‌న‌కు అసెంబ్లీలో, పార్ల‌మెంటులో సీట్లు ఉంటే పోరాడేవాడిన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ధైర్యం ఆయ‌న‌కు లేదా?' అని అంబ‌టి ప్ర‌శ్నించారు.

ఇటువంటి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు రాజ‌కీయాలు ఎందుకు? సినిమాలు చేసుకుంటే స‌రిపోతుంది క‌దా? అని అంబ‌టి రాంబాబు నిల‌దీశారు. త‌డాఖా చూపిస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నారని, రాజ‌కీయాలంటే సినిమాలు కాద‌ని అంబ‌టి చురక అంటించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ అని ఆయ‌న ఎద్దేవా చేశారు.


More Telugu News