నైజామ్ లో కొత్త రికార్డు సెట్ చేసిన 'అఖండ'
- ఈ నెల 2న వచ్చిన 'అఖండ'
- తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు
- నైజామ్ లో 17.36 కోట్ల షేర్
- 11 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు
కొంతకాలంగా సరైన హిట్ లేని బాలయ్య .. బోయపాటి ఇద్దరూ కూడా, 'అఖండ'తో అనూహ్యమైన విజయాన్ని అందుకున్నారు. పైగా ఇది ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ కూడా. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో ఒకటి రెండు రోజులకు మించి నిలబడలేదు. కానీ 'అఖండ' అందుకు భిన్నంగా దూసుకుపోతోంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా 11 రోజుల్లో 17.36 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు. నైజామ్ లో ఈ సినిమా 10.50 కోట్ల బిజినెస్ ను జరుపుకోగా, నిన్నటివరకూ రాబట్టిన షేర్ 17.36 కోట్లని వెల్లడించారు.
ఈ ఏడాదిలో థియేటర్లకు వచ్చిన సినిమాలే చాలా తక్కువ. హిట్ అనిపించుకున్నవి మరీ తక్కువ. ఏడాది మొత్తం మీద చూసుకుంటే, నైజామ్ వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డును సెట్ చేసిందని అంటున్నారు. 'పుష్ప' సినిమా థియేటర్లకు వచ్చేవరకూ కూడా ఈ జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.