మాస్ సాంగ్ తో రచ్చ చేస్తున్న రవితేజ!

  • 'ఖిలాడి'గా రవితేజ
  • ముగింపు దశలో షూటింగ్
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఫిబ్రవరి 11వ తేదీన విడుదల  
'క్రాక్' సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ ను దడదడలాడించిన రవితేజ, సాధ్యమైనంతవరకూ 'ఖిలాడి' సినిమాను కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేయాలని చూశాడు .. కానీ కుదరలేదు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది.

హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ రోజున ఒక పాట చిత్రీకరణను మొదలుపెట్టారు. రవితేజ .. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతిపై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఒక మాస్ మసాలా సాంగ్ ఇది.

ఈ సినిమాలో ఒక పాటను రవితేజ స్వయంగా పాడినట్టుగా వార్తలు వచ్చాయి. మరి అది ఈ పాటనా? కాదా? అనే విషయం మాత్రం తెలియదు. అర్జున్ .. సచిన్ ఖేడ్కర్ .. ఉన్నిముకుందన్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అనసూయ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


More Telugu News