సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని విడుదల చేసిన ఆర్మీ
- ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి
- భారత్-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు
- డిసెంబరు 7న స్వర్ణిమ్ విజయ్ పర్వ్ వేడుకలు
- సందేశం ఇచ్చిన రావత్
హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, సీడీఎస్ హోదాలో బిపిన్ రావత్ ఇచ్చిన సందేశాన్ని ఆర్మీ నేడు ఓ చిన్న వీడియో క్లిప్పింగ్ రూపంలో విడుదల చేసింది. 1971 ఇండో-పాక్ యుద్ధానికి 50 ఏళ్లయిన సందర్భంగా డిసెంబరు 7న రావత్ ఈ సందేశం ఇచ్చారు.
"మన బలగాల పట్ల ఎంతో గర్విస్తున్నాం. నాటి విజయాన్ని మనందరం కలిసి వేడుక చేసుకుందాం. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ ను పురస్కరించుకుని వీర సైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా, రావత్ అందించిన ఈ సందేశాన్ని ముందే రికార్డు చేసి విజయ్ పర్వ్ వేడుకల్లో వినిపించారు. ఇప్పుడదే వీడియోను ఆర్మీ పంచుకుంది.
గత బుధవారం తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన అర్ధాంగి మధులిక, మరో 10 మంది సైనికాధికారులు, పైలెట్ మరణించడం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.