తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు: డీహెచ్ఎంఓ
- ఏపీలో ఒమిక్రాన్ కలకలం
- విజయనగరంలో ఒకరికి నిర్ధారణ
- తిరుపతిలోనూ ఒమిక్రాన్ కేసు అంటూ ప్రచారం
- వదంతులు నమ్మొద్దని డీహెచ్ఎంఓ సూచన
ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. ఇప్పటికే విజయనగరంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ కాగా, తిరుపతిలోనూ 34 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, అతడు బ్రిటన్ నుంచి వచ్చాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీహరి స్పందించారు.
తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు వస్తున్న వదంతులను నమ్మవద్దని డీహెచ్ఎంఓ శ్రీహరి తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోనా పాజిటివ్ కేసు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని, ఒమిక్రాన్ అని ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించారు. దీనిపై ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని అన్నారు.