స్వాతంత్ర్యం ఇస్తామంటే వద్దంటున్న దీవి ఇదే!
- పసిఫిక్ మహాసముద్రంలో చిన్న దీవి న్యూ కలెడోనియా
- ఫ్రాన్స్ పాలనలో కొనసాగుతున్న దీవి
- ఫ్రెంచ్ ప్రాదేశిక భూభాగంగా గుర్తింపు
- ఫ్రాన్స్ పాలనలోనే హాయిగా ఉందంటున్న ప్రజలు
న్యూ కలెడోనియా దీవి... విశాల పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న బిందువులా కనిపిస్తుంది. ఈ ద్వీపానిది ఒక విచిత్రమైన కథ. భారత్ వంటి దేశాలు స్వాతంత్ర్యం కోసం వందల సంవత్సరాలు పోరాడి, వేల ప్రాణాలు అర్పించాయి. కానీ న్యూ కలెడోనియా మాత్రం స్వాతంత్ర్యం ఇస్తామంటే వద్దంటోంది. ఈ దీవి చాలా కాలంగా అగ్రరాజ్యం ఫ్రాన్స్ అధీనంలో ఉంది.
తాజాగా మరోసారి స్వాతంత్ర్యం కోసం రిఫరెండం నిర్వహించగా, న్యూ కలెడోనియా ప్రజలు తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఓటేశారు. ఫ్రాన్స్ పాలనలో సుఖంగా ఉన్నామని, ఫ్రాన్స్ ఏలుబడి నుంచి బయటికి వస్తే దేశంలో అరాచకం, అస్థిరత్వం ప్రబలుతుందని అక్కడి ప్రజల భయం. ఎక్కడైనా సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ మహా అయితే 85 శాతానికి మించదు. కానీ న్యూ కలెడోనియాలో స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన రిఫరెండంలో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 96.32 శాతం మంది స్వాతంత్ర్యం వద్దని ఓటేశారట.
న్యూ కలెడోనియాలో 1,85,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కులో ఉంటుంది. ఇక్కడ స్థానిక జాతులతో పాటు ఫ్రెంచ్ వాళ్లు కూడా నివసిస్తున్నారు. 1988లో చేసిన ఓ తీర్మానం ప్రాతిపదికగా ఇప్పటికి మూడు పర్యాయాలు రిఫరెండం నిర్వహించారు. మూడేళ్ల కిందట కూడా రిఫరెండం నిర్వహించగా, అత్యధికులు స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటేశారు.
ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యం పాలనను వదులుకోవడానికి ఎవరు సిద్ధపడతారు చెప్పండి! ఇప్పుడు కలెడోనియా ప్రజలదీ అదే పరిస్థితి. పలు దేశాలు కూడా ఇక్కడ ఫ్రాన్స్ అధికారం ఉండాలనే భావిస్తున్నాయి. విస్తరణ వాదంతో దూసుకుపోతున్న చైనాకు పసిఫిక్ మహాసముద్రంలో ఫ్రాన్స్ వంటి పెద్ద దేశం చెక్ పెట్టగలదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.