బాలయ్య కెరీర్ లోనే తొలిసారి.. ‘వంద కోట్ల క్లబ్’ లోకి ‘అఖండ’

  • 10 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • ప్రపంచవ్యాప్తంగా రూ.58.74 కోట్ల షేర్
  • 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను దాటిన చిత్రం
బాక్సాఫీస్ వద్ద బాలయ్య ప్రభంజనమే సృష్టించారు. ‘అఖండ’గా రికార్డులు తిరగరాస్తున్నారు. తన కెరీర్ లోనే తొలిసారిగా వంద కోట్ల వసూళ్లు సాధించారు. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూడో సినిమా అఖండకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

నైజాంలో రూ.16.50 కోట్లు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.10 కోట్లు, గుంటూరులో రూ.3.96 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.39 కోట్లు, కృష్ణాలో రూ.2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.80 కోట్లు, నెల్లూరులో రూ.2.15 కోట్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.49.34 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపితే ఈ పది రోజుల్లో రూ.9.35 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.58.74 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటాయని అంటున్నారు.

రెమ్యూనరేషన్స్ సహా సినిమాకు రూ.53 కోట్ల దాకా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే విడుదలైన 8 రోజులకే సినిమా వసూళ్లలో బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. ఏపీలో బెనిఫిట్ షోలపై బ్యాన్, టికెట్ ధరలపై నియంత్రణ లేకుంటే కలెక్షన్లు మరో రేంజ్ లో ఉండేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేం కరోనా లాక్ డౌన్ల తర్వాత థియేటర్లలో విడుదలై.. సినిమా ఇండస్ట్రీకి అఖండ ఊపిరి పోసిందని అంటున్నారు ప్రముఖులు. 


More Telugu News