'మా'లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాకు ఆమోదం.. మంచు విష్ణు కీలక నిర్ణయం
- ఇటీవల రాజీనామా లేఖలు పంపిన సభ్యులు
- మొదట రాజీనామాలు చేయొద్దని కోరిన విష్ణు
- వినిపించుకోకపోవడంతో రాజీనామాల ఆమోదం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడి పదవికి పోటీ చేసి మంచు విష్ణు చేతిలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి, ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు ఇప్పటికే రాజీనామా చేస్తూ లేఖలు పంపారు. మొదట రాజీనామాలు చేయొద్దని, ఆ లేఖలు వెనక్కి తీసుకోవాలని విష్ణు కోరాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో వారి రాజీనామాలను ఆమోదిస్తూ విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ 11 మంది స్థానాల్లో తన ప్యానల్ నుంచి ఓడిపోయిన 11 మంది సభ్యుల్ని విష్ణు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 'మా' లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్ స్థానంలో బాబూమోహన్‌ను నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి పోస్టు ఒక వ్యక్తిని నామినేట్ చేసే అధికారం విష్ణకు ఉంటుంది.