మన దేశం అప్పు రూ.1,35,86,975 కోట్లు.. 1950లో ఎంతుండేదో తెలుసా?
- ఆనాడున్న రుణాలు రూ.2,565.40 కోట్లు
- 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగిన రుణ భారం
- ఈ ఏడేళ్లలోనే రూ.73,44,754 కోట్లు
అప్పు ఉందంటేనే భయపడిపోతుంటాం. అప్పుల బాధతో ఎంతో మంది చనిపోయినవారినీ చూశాం. అప్పుల కుప్పలు పెరిగిపోయి రైతన్నలు ఒరిగిపోతున్న ఘటనలూ జరుగుతూనే ఉన్నాయి. మరి, మన దేశానికి ఉన్న అప్పుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన దేశానికి అప్పులెన్ని ఉన్నాయి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అవి ఎంత పెరిగాయో తెలుసా?
ఇనగంటి రవికుమార్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా ఆ విషయాన్నే రాబట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం సంపాదించారు. కేంద్రం జవాబు ప్రకారం.. గత 70 ఏళ్లలో మన దేశ అప్పు 5.29 లక్షల శాతం పెరిగిపోయిందంటే నమ్మగలరా! అవును, 1950–51లో భారత నికర అప్పులు రూ,2,565.40 కోట్లు కాగా.. 2021–2022 నాటికి అవి రూ.1,35,86,975.52 కోట్లకు పెరిగింది. చెప్పాలంటే అక్షరాల మన అప్పు ‘కోటీ 35 లక్షల 86 వేల 975.52 కోట్ల రూపాయలు’.
2014–15 నాటికి మన దేశ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు. అంటే ఈ ఏడేళ్లలో అప్పుడు 117 శాతం పెరిగింది. ఈ ఏడేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం రూ.73,44,754 కోట్ల అప్పు చేసింది. మొత్తంగా మన దేశంలోని వివిధ బ్యాంకుల, ఇతరత్రా మార్గాల ద్వారా తీసుకున్న అప్పు రూ.1,13,57,415 కోట్లు కాగా.. విదేశాల నుంచి తీసుకున్న రుణం రూ.4,27,925.24 కోట్లుగా ఉంది.
70 ఏళ్ల క్రితం చమురు సంస్థలు, ఎరువుల కంపెనీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చే రాయితీలు ఏమీ లేవు. కానీ, ఇప్పుడు ఆయా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,62,827.90 కోట్లను చెల్లిస్తోంది. దాంతో పాటు రక్షణ రంగ పటిష్ఠత, వివిధ సంక్షేమ పథకాల కోసం భారీగా వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.