సోమశిల జలాశయానికి భారీగా వరద
- నిండు కుండలా జలాశయం
- ఇన్ ఫ్లో 27,639 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 36,750 క్యూసెక్కులు
- ప్రస్తుతం నీటి మట్టం 76.639 టీఎంసీలు
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరి, జలాశయం నిండు కుండలా మారింది. ఆ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు.
జలాశయంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో 27,639 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల జలాశయ పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా ఉంటుంది. ప్రస్తుతం అందులో నీటి మట్టం 76.639 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.