కాంగ్రెస్ చేసిన ఆ తెలివి తక్కువ పనివల్లే మమత వ్యతిరేకిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

  • ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాసాలు రాశా
  • అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు
  • చైనా ప్రజాస్వామ్య దేశం కాకున్నా.. పంచాయతీ పరిధిలో స్వేచ్ఛగా నిర్ణయాలు
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తుడడం వెనక ఉన్న కారణాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో నిన్న ‘చేంజ్ మేకర్స్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శశిథరూర్ మాట్లాడుతూ.. పలు విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మమతకు మద్దతు ఇవ్వకుండా తెలివి తక్కువ పనిచేసిందని, కాంగ్రెస్‌పై మమత వ్యతిరేక భావనతో ఉండడానికి అందుకేనని అభిప్రాయపడ్డారు.

దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గతంలో తాను చాలా వ్యాసాలు రాశానని, ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అయితే, అప్పటి కాంగ్రెస్, ఇప్పటి కాంగ్రెస్ రెండు వేర్వేరని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో చాలా వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. చైనా ప్రజాస్వామ్య దేశం కానప్పటికీ అక్కడ పంచాయతీ అధ్యక్షుడు కూడా తన పరిధిలోని నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునే వెసులుబాటు ఉందని, తనకు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం వస్తే అలాంటి వ్యవస్థను అందుబాటులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.


More Telugu News